Monday, July 7, 2008

Hyderabad వాసులకు police శాఖ వారి అధ్భుతమైన కానుక


మన సమాజం మిత్ర్ల్లులా మెలగాల్సిన పోలీసులతో భయం భయంగా మసులుకుంటుంది. కారణం పోలీసు శాఖ గురించి, వారి పనితీరు గురించి సరైన అవగాహన కొరవడడమే అని నా అభిప్రాయం.

ఆ అపోహని తొలగించడానికి వారు ఒక అడుగు ముందుకు వేసి http://cyberabadpolice.gov.in/ అనే site ని ప్రారంభించింది. మనం కూడా ఒక అడుగు వారి వైపు వేసి ఆ దూరాన్ని తొలగిద్దాం. మంచి పౌరులం అనిపించుకుందాం.

ఇందులో ఎంతో మంచి సమాచారాన్ని పొందుపరిచి మనకి సహయం చేయడనికి వారు సిద్దంగా ఉన్నారు.
రండి. వారి సహాయాన్ని ఉపయోగించుకుందాం.
Thanks to Commissioner of Police, Cyberabad.

మీ
మహి

ముస్లిం యువతులకు శుభవార్త


మన హైదరాబాద్ లో ముస్లిం యువతుల వైవాహిక జీవితంలో ఎదుర్కోనే సమస్యలకు "మీకు సహాయంగా మేమున్నాం" అంటూ ముందుకు వస్తుది "ముస్లిం యువతుల సమాఖ్య" (Muslim Girls Association).

మీకు వివాహానికి ముందు గాని, వివాహం తర్వాత గాని ఎటువంటి కుటుంబ సమస్య వచ్చినా మీరు ఒక్క phone call తో వారి సహాయాన్ని పొందొచ్చు. మీరు dial చేయవలసిన నంబరు 040-66632672.

ఇలా వారి సహయాన్ని పొందినందుకు మీరేమి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి కూడా ఎక్కువ complaints వస్తుంటే వారి సేవా కార్యక్రమాల్ని విస్త్రుత పరిచే అవకాశం ఉంది.

తోటి వారికి సహాయం చేయండి.
మీ మహి.

Wednesday, June 25, 2008

Hyderabad లో Autowala మోసాలు


రెండు రోజుల క్రితం మా నాన్నని CARE Hospital కి తీసుకువెల్దామని ఇంటినుండి బయలుదేరాను.
Kukatpalli Bus stop పక్కన ఉన్న Auto Standకి వెళ్ళి Auto Driver లని అడగటం మొదలుపెట్టాను. ఒక్కరు కూడ meter పైన అంటే రావడం లేదు. 200/- అడుగుతున్నారు. చివరకు BHEL నుండి వస్తున్న ఒక Auto వస్తే తనని అడిగితే Meter పైన రావడానికి ఒప్పుకున్నడు. మొత్తం 56/- అయింది.
ఇలాంటి సంఘటనే ఎంతో మందికి అయి ఉంటుంది. Hospital కి వెళ్తూ Autowala తో గొడవ ఎందుకని ఎంత అడిగితే అంత ఇచ్చి వెళ్తున్నాం. కానీ ఇలా చేయడం సరేనా?
నేను ఎవరికి complaint ఇవ్వాలో తెలియక Eenadu News paper వాళ్ళకి తెలియజేశా. వాళ్ళు ఒక నిన్న ప్రత్యేక కథనం ప్రచురించారు. ఈరోజు police శాఖ వారు 10 mobile team లను ప్రవేశపెట్టారు. వాళ్ళ mobile numbers ఈనాడు లో ప్రచురించారు.
మీరు కూడా ఏమైనా complaint చేయదలిస్తే 1034 (Toll Free) number కి దయచేసి call చేసి తెలియచేయండి.
మహా అయితే ఒక రూపాయి ఖర్చు. ఎన్నో ఖర్చులు చేసే మనకి ఒక రూపాయి పెద్ద ఖర్చేమి కాదని నా అభిప్రాయం. మన సమాజంలో ఎంతో మంది. ఇలాంటి మోసాలకి గురవుతున్నారు. మీరు ఒక రూపాయి ఖర్చు పెడితే మీ తోటి వారికి వంద రూపాయలు ఆదా చేసిన వారౌతారు.
యచేసి పెద్ద మనసుతొ మన సమాజం కోసం కొంచం ఆలోచించండి.
-మీ
మహి

Thursday, June 19, 2008

తెలుగు వారి కోసం

మీ కోసం నా తదుపరి వ్యాసాలు తెలుగులో ఉంటాయి.
నా blog లో ఎక్కువగా తెలుగు వారికి సంభందించిన వ్యాసాలు మాత్రమే ఉంటాయి.
ఇవి మీ దైనందిక జీవితంలో ఏ రకంగా అయిన ఉపయోగపడితే నా క్రుషి ఫలించినట్లే.

మీ సేవలో
-మహి

Modati maata


Nenu naa samaja sevalo okinta bagasvamini kaaavalani ee blog start chestunnanu...
Rojuvaari dina charyalo enno anubavalu..vaatilo chala raajyanga viruddanga jarugutunna..ide jeevitam antu aa tappunu choostu kuda calmga munduku vellipotunnam...Eeroju naaku eduraina anbavame repu meeku edurukavochu...anduke nirnainchukunna..jarugutunna tappulanu naaku veelainantalo edutivariki cheppi kaneesam vaarinaina vaati barina padakunda kaapadalannade naa dyeyam...Aaashayam peddade...acharana kasta sadyame...kaani veyi mailla dooramaina oke aduguto modalu pettalanna sookte nannu ee blog start cheyadanki prerepinchindi...
Nannu artam chesukoni..naa lakshya saadanalo meeru paalu panchukoni..
"Nenu saitam" antu samaja sevalo oka chiru deevitini veligistarani aashistu...


-mee
Mahi