Showing posts with label Auto Driver. Show all posts
Showing posts with label Auto Driver. Show all posts

Wednesday, June 25, 2008

Hyderabad లో Autowala మోసాలు


రెండు రోజుల క్రితం మా నాన్నని CARE Hospital కి తీసుకువెల్దామని ఇంటినుండి బయలుదేరాను.
Kukatpalli Bus stop పక్కన ఉన్న Auto Standకి వెళ్ళి Auto Driver లని అడగటం మొదలుపెట్టాను. ఒక్కరు కూడ meter పైన అంటే రావడం లేదు. 200/- అడుగుతున్నారు. చివరకు BHEL నుండి వస్తున్న ఒక Auto వస్తే తనని అడిగితే Meter పైన రావడానికి ఒప్పుకున్నడు. మొత్తం 56/- అయింది.
ఇలాంటి సంఘటనే ఎంతో మందికి అయి ఉంటుంది. Hospital కి వెళ్తూ Autowala తో గొడవ ఎందుకని ఎంత అడిగితే అంత ఇచ్చి వెళ్తున్నాం. కానీ ఇలా చేయడం సరేనా?
నేను ఎవరికి complaint ఇవ్వాలో తెలియక Eenadu News paper వాళ్ళకి తెలియజేశా. వాళ్ళు ఒక నిన్న ప్రత్యేక కథనం ప్రచురించారు. ఈరోజు police శాఖ వారు 10 mobile team లను ప్రవేశపెట్టారు. వాళ్ళ mobile numbers ఈనాడు లో ప్రచురించారు.
మీరు కూడా ఏమైనా complaint చేయదలిస్తే 1034 (Toll Free) number కి దయచేసి call చేసి తెలియచేయండి.
మహా అయితే ఒక రూపాయి ఖర్చు. ఎన్నో ఖర్చులు చేసే మనకి ఒక రూపాయి పెద్ద ఖర్చేమి కాదని నా అభిప్రాయం. మన సమాజంలో ఎంతో మంది. ఇలాంటి మోసాలకి గురవుతున్నారు. మీరు ఒక రూపాయి ఖర్చు పెడితే మీ తోటి వారికి వంద రూపాయలు ఆదా చేసిన వారౌతారు.
యచేసి పెద్ద మనసుతొ మన సమాజం కోసం కొంచం ఆలోచించండి.
-మీ
మహి