Showing posts with label samaikyandhra. Show all posts
Showing posts with label samaikyandhra. Show all posts

Monday, July 11, 2011

సమైఖ్యాంధ్రకై నినదించే సీమాంధ్ర విధ్యార్థులు మూర్ఖులా లేక సీమాంధ్ర నాయకుల చేతుల్లో కీలుబొమ్మలా?

"సమైఖ్యాంధ్రకై నినదించే సీమాంధ్ర విధ్యార్థులే మూర్ఖులా లేక సీమాంధ్ర నాయకుల చేతుల్లో కీలుబొమ్మలా" అనేది వాళ్ళే తేల్చుకోవాలి. తోటి విధ్యార్థులను ఈవిధంగా ప్రశ్నించడం బాద కలిగించినా, ఈ క్రింది ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పి ఆ తర్వాత వారు నిర్ణయం తీసుకోవాలి.
1. 2009 Elections సమయంలో కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలు వారి వారి manifestoల్లో ప్రత్యేక తెలంగాణకి వారు కట్టుబడి ఉన్నట్టు పొందుపరిచారు.
మరి ఈ విధ్యార్థులు అప్పుడే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? వారి వారి నాయకులను ఎందుకు నిలదీయలేదు?
టి.డి.పి 2009 manifestoలో page 40 వారు ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.
"Telugu Desam Party declares that it will resume all political and legal initiatives to pursue the goal of achieving a separate Telengana State after assuming power".
congress 2009 manifestoలో page 23లో వారు తెలంగాణకి కట్టుబడి ఉన్నట్టు పొందుపరిచారు.
2. సరే విధ్యార్థులు manifestoల్లో ఏముందో చూడలేదనుకుందాం. కాని ఆయా పార్టీలు తెలంగాణకి సై అని, TRSతో పొత్తు పెట్టుకున్నప్పుడైనా ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? వారి వారి నాయకులను ఎందుకు నిలదీయలేదు?
3. December 9, 2009లో కేంద్ర ప్రకటన వెలుబడే ముందు జరిగిన ALL PARTY MEETING లో అన్ని పార్టీలు తెలంగాణకి OK చెప్పినప్పుడైనా విధ్యార్థులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? వారి వారి నాయకులను ఎందుకు నిలదీయలేదు?
4. పై మూడు సందర్భాలలో "సమైఖ్యాంధ్ర ఉద్యమం" చేయని సీమాంధ్ర విధ్యార్థులు, December 9, 2009లో కేంద్ర ప్రకటన తర్వాత అకస్మాత్తుగా అప్పుడే మత్తు వీడినట్టు "సమైఖ్యాంధ్ర ఉద్యమం" చేయడం సమంజసమా?
తెలంగాణ కోసం 600 పైచీలుకు విధ్యార్థులు ప్ర్రాణార్పణ గావించారు. కనీసం 5 విధ్యార్థులు సమైఖ్యాంధ్ర కోసం ప్ర్రాణార్పణ గావించారా? ఇక్కడ నా ఉద్దేశ్యం సమైఖ్యాంధ్ర విధ్యార్థులు చావాలని కాదు. కాని వారు తెలంగాణ కోసం 600 పైచీలుకు విధ్యార్థులు ప్ర్రాణార్పణ గావించారో అర్థం చేసుకోవాలనేదే మా ఆవేదన.
సమైఖ్యవాద నాయకులు సీమాంధ్ర విద్యర్థులకు నూరిపోసినట్టు, తెలంగాణలో నాయకులు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు ఉద్యమంలో పాల్గొనడంలేదు. ఫ్రొ. జయశంకర్, దిలీప్ లాంటి ఎంతో మంది మేధావుల స్ప్పూర్థితో తెలంగాణ విద్యార్థి లోకం ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు.
దయచేసి స్వార్థపూరిత సమైఖ్యవాద నాయకుల మాటలు నమ్మి కృత్రిమ ఉద్యమం చేయకండి. "ప్రాంతాలుగా విడిపోదాం. అన్నదమ్ముల్ల కలిసుందాం". కాని ప్రాంతాలుగా కలిసుండి అంతర్గత వైశమ్యాలతో కొట్టుకునేలా చేయకండి. విడిపోవడానికి కల అభ్యంతరాలను చర్చించి పరిశ్కరించుకుందాం. తెలంగాణ ప్రజల న్యాయమైన పోరాటానికి మీ సమ్మతి తెలిపి ప్రాంతాలుగా విడిపోయిన మనం ఎప్పటికీ అన్నదమ్ములమే అని నిరూపిద్దాం.